స్వీట్స్ లో పురుగుల మందు కలిపి తిని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!

0
5
స్వీట్స్ లో పురుగుల మందు కలిపి తిని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘటన
  • పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు
  • ప్రస్తుతం నిలకడగా ప్రేమికుల ఆరోగ్యం

తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట స్వీట్స్ లో పురుగుల మందు కలిపి తిని ఆత్మహత్యకు యత్నించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని జగతిమెట్ట కొండపై ఈ ఘటన జరిగింది. జిల్లాలోని వజ్రపు కొత్తూరుకు చెందిన యువకుడు, టెక్కలికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే, ఇందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరూ కలిసి జగతిమెట్ట కొండపైకి చేరుకున్నారు. అనంతరం వెంట తెచ్చుకున్న స్వీట్స్‌లో పురుగుల మందు కలిపి తిన్నారు. అనంతరం యువకుడు తన చిన్నాన్నకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే కొండపైకి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.