టీ20లో ఇండియా ఓట‌మి…

0
8
టీ20లో ఇండియా ఓట‌మి…

వెల్లింగ్టన్ న్యూస్ టుడే: భారత్ -న్యూజిలాండ్ టి20 సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టి20లో టీంఇండియా 80 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. 220 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 19.2 ఓవ‌ర్ల‌లో 139 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. భార‌త ఇన్సింగ్స్ లో ధోని 39, శిఖ‌ర్ ధావ‌న్ 29, విజ‌య్ శంక‌ర్ 27, ప‌రుగులు చేశారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టీమ్ సౌధీ3, ఫెర్గ్యూస‌న్, సాంట్న‌ర్, సోథీ త‌లా రెండు వికెట్ల‌తో భార‌త ప‌త‌నాన్ని శాసించారు. అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 219ప‌రుగులు చేసింది. టిమ్‌ సీఫర్ట్ 84, మ‌న్రో 34, విలియ‌మ్ స‌న్ 34, టేల‌ర్ 23ప‌రుగుల‌తో రాణించ‌డంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here