‘డిస్కోరాజా’ సరసన తాన్యా హోప్

0
2
‘డిస్కోరాజా’ సరసన తాన్యా హోప్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • వీఐ ఆనంద్ నుంచి ‘డిస్కోరాజా’
  • రవితేజ సరసన ముగ్గురు భామలు 
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

                                   వివరాల్లోకి వెళితే…‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజను మళ్లీ వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. దాంతో ఈ సారి కథలపై ఆయన మరింత శ్రద్ధ పెట్టాడు. తను కొత్తగా కనిపించడమే కాకుండా కథలో కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. అలా ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తున్నారు. మరో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి చివరికి ‘తాన్యా హోప్’ను ఖరారు చేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో తాన్యా హోప్ జాయిన్ అవుతుందని అంటున్నారు. రవితేజ – తాన్యా హోప్ కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకోనుంది.