పిస్తా, క్రాన్ బెర్రీ కాంబినేషన్ లో టేస్టీ బిస్కెట్

0
5
పిస్తా, క్రాన్ బెర్రీ కాంబినేషన్ లో టేస్టీ బిస్కెట్

 

కావాల్సిన పదార్ధాలు:
  • ఎండ బెట్టిన క్రాన్ బెర్రీస్-1 కప్పు,
  • పిస్తాచియోస్-1 1/2కప్పు,
  • మైదా-2 1/2 కప్పు,
  • కరిగిన వెన్న -1 కప్పు,
  • ఐసింగ్ షుగర్-1 1/2 కప్పు,
  • గ్రుడ్లు-2,
  • బేకింగ్ పౌడర్-1/4 టీ స్పూను,
  • వెనీలా ఎసెన్స్-2 టీ స్పూనులు,
  • ఉప్పు-చిటికెడు.
 తయారీ విధానం:
క్రాన్‌బెర్రీస్, పిస్తా పప్పులని మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరిగిన వెన్న,గ్రుడ్లు, మైదా, ఉప్పు, ఐసింగ్ షుగర్ వెయ్యాలి. అన్నింటినీ బాగా కలిపాకా కాస్త తడి తడిగా ఉండి చేతులకి అంటుకునేలా ఉన్న పిండి తయారవుతుంది. తడిగా ఉన్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. క్రాన్‌బెర్రీస్ వల్ల పిండి చేతులకి అంటుకుంటూ ఉంటుంది. దీనికి కొంచెం మైదా కలిపి చేతులతో పిండిని బాగా కలపాలి. కొంచెం మైదాని పీట మీద చల్లి పిండిని సిలిండర్ ఆకారంలో వత్తుకోవాలి.ఒత్తుకున్నాకా పైన ఫ్లాట్‌గా ఉండేటట్లు చూడాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానిలో ఈ పిండిని ఉంచండి. ఓవెన్‌ని 160 డిగ్రీల సెల్సియస్‌కి వేడి చేసి 20-22 నిమిషాలపాటు పిండిని బేక్ చెయ్యండి. బేక్ అయిన పిండిని బయటకి తీసి 10 నిమిషాలపాటు చల్లారనివ్వండి. ఇప్పుడు బయటకి తీసిన పిండిని ముక్కలుగా కొయ్యండి. బిస్కటీలు లోపల ఇంకా పచ్చిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ బేకింగ్ ట్రేలో పెట్టి 10 నిమిషాల పాటు బేక్ చెయ్యండి. బయటకి తీసి రుచి చూడండి. మీ బిస్కటీలు కరకరలాడుతూ క్రాన్ బెర్రీస్ వల్ల రుచికరంగా కూడా ఉన్నాయని చూసారు కదా. ఇక వీటిని మీ అతిధులకి కాఫీతో పాటు అందించడమే.
                                                                                                                      డెస్క్:లక్ష్మీ