టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్…..

0
12
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్…..

కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:

మచిలీపట్నం మండలం కానూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేర్నినాని ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పేర్నినాని ప్రతి ఒక్కరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తదనంతరం పేర్నినాని మాట్లాడుతూ, మనల్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వారికి మనం అండగా నిలవాలని ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని అన్నారు. గ్రామ శ్రేయస్సు కోసం అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి వచ్చిన కొందరు ముఖ్యనేతలు మాట్లాడుతూ ఓట్లు కావలసినప్పుడే కానూరు ప్రజలు మంత్రికి గుర్తుకొస్తున్నారని, మా గ్రామంలో అభివృద్ధి అనేదే లేదని, మేము చాలాకాలంగా గమనిస్తున్నామన్నారు. నాయకుడంటే ప్రజలకు అందుబాటులో వుండేవారేనని, పేర్నినాని ప్రతికార్యకర్తకు ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటారని అన్నారు. జై జగన్, జై పేర్నినాని అను నినాదాలతో కానూరు ప్రాంతమంతా మారుమోగింది.

                                                                                                  డెస్క్:విధుల&ఖాన్