తెలుగువారి అతిథి – రాఘవేంద్రస్వామి…

0
7
తెలుగువారి అతిథి – రాఘవేంద్రస్వామి…

తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండలు శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 9), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 346 ఏళ్లు కావస్తున్నాయి. ఆ సందర్భంగా స్వామివారు తలపు…స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు. నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మికలోకంలో వినుతికెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికి బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు. వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు.తర్వాత విషయం మరోసారి తెలుసుకుందాం.

                                                                                                               డెస్క్:దుర్గ