నా నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు : అమిర్‌ ఖాన్‌కు మోదీ ట్విట్టర్‌ సందేశం

0
24
నా నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు : అమిర్‌ ఖాన్‌కు మోదీ ట్విట్టర్‌ సందేశం

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ప్లాస్టిక్‌ నిషేధానికి పిలుపునిచ్చిన ప్రధాని
  • అక్టోబర్‌ 2 నుంచి శ్రీకారం చుడదామని పిలుపు
  • దీనికి ట్విట్టర్‌లో మద్దతు తెలిపిన బాలీవుడ్‌ హీరో

                                        వివరాల్లోకి వెళితే….ప్రముఖ బాలీవుడ్‌ హీరో అమిర్‌ఖాన్‌కు ప్రధాని మోడీ  కృతజ్ఞతలు తెలిపారు. నా నిర్ణయాన్ని సమర్ధించినందుకు ధన్యవాదాలని ట్వీట్‌ చేశారు. పర్యవరణ పరిరక్షణకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని నిలిపి వేయాలని, ఈ సత్సంకల్పానికి అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల తన ఆల్‌ ఇండియా రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్‌లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ‘ మీ నిర్ణయం చాలా గొప్పది. దాన్ని స్వాగతిస్తున్నా. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం’ అని ఆమిర్‌ ఖాన్ ట్విటర్‌ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తు మోదీ  ట్వీట్‌ చేశారు.