అందుకే అజయ్ భూపతికి రవితేజ నో చెప్పాడట……….

0
7
అందుకే అజయ్ భూపతికి రవితేజ నో చెప్పాడట……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • రవితేజతో సినిమా ప్లాన్ చేసిన అజయ్ భూపతి 
  • ఫస్టాఫ్ నచ్చిందన్న రవితేజ 
  • సెకండాఫ్ పట్ల అసంతృప్తి

‘ఆర్ ఎక్స్100’ వంటి సూపర్ హిట్ తరువాత, రవితేజ కథానాయకుడిగా ‘మహా సముద్రం’ సినిమాను రూపొందించాలని దర్శకుడు అజయ్ భూపతి అనుకున్నాడు. అయితే ఆ తరువాత అజయ్ భూపతి చేసిన ఒక ట్వీట్ తో, ఈ సినిమాను ఆయన రవితేజతో చేయడం లేదనే విషయం చాలామందికి అర్థమైపోయింది. దాంతో కారణమేమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు.అజయ్ భూపతి చెప్పిన ‘మహా సముద్రం’ కథలో ఫస్టాఫ్ నచ్చిందని చెప్పిన రవితేజ్, సెకండాఫ్ లో కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేయడానికి అజయ్ భూపతి ఒప్పుకోలేదని సమాచారం. ఇలా వుంటేనే బాగుంటుందని అజయ్ భూపతి చెప్పడంతో, మార్పులు చేయకపోతే తను చేయడం కష్టమేనని రవితేజ అన్నాడట. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.