విధి పలకని ముగింపుతో అంతులేని ఆవేదన

0
2
విధి పలకని ముగింపుతో అంతులేని ఆవేదన

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • 38 రోజులైనా దొరకని యువ ఇంజనీర్‌ మృతదేహం
  • బోటు వెలికితీశారని తెలియగానే వచ్చిన కుటుంబం
  • కన్నీటితో గోదావరి ఒడ్డున ఎదురుచూపు

                             వివరాల్లోకివెళితే…ఆ కుటుంబానికి ఎదురైన విషాదాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలవు. విధి పలకని ముగింపుతో దిక్కుతోచని స్థితి వారిది. మనిషి పోయిన బాధ కంటే ఆ మనిషి చివరి చూపు కూడా దక్కలేదన్న ఆవేదన జీవితాంతం వెన్నంటి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద నీట మునిగిన ‘రాయల్‌ వశిష్ట’లో ప్రయాణిస్తూ గల్లంతైన కారుకూరి రమ్య కుటుంబ సభ్యుల వేదన ఇటువంటిదే. ఘటన జరిగి 38 రోజులైనా కుమార్తె ఆచూకీ కూడా లభించక పోవడం ఆ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. బోటు వెలికి తీశారని తెలియగానే ఏదో తెలియని ఆశతో పది మంది కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాల్లో రమ్య ఉందో లేదో తెలియక అల్లాడిపోతున్నారు.