కోహ్లీసేనకి ఆఖరి ఛాన్స్….

0
4
కోహ్లీసేనకి ఆఖరి ఛాన్స్….
ముఖ్యంశాలు:
* ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఈరోజు ఏడో మ్యాచ్ ఆడనున్న బెంగళూరు.
*ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన.
ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుస ఓటములతో బోణి కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఈరోజు ఆఖరి అవకాశం. సుదీర్ఘకాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు జట్టు.. తాజా సీజన్‌లో కనీసం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో తప్పక‌ గెలవాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన.. ఈరోజు రాత్రి 8 గంటలకి మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢీకొట్టబోతోంది. చావోరేవో మ్యాచ్ కావడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడుతూ వస్తోంది. మధ్యలో ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి, డివిలియర్స్, పార్థీవ్ పటేల్ మెరిసినా..  ఇ చాహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నా.. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. ఎంతలా అంటే..? 205 పరుగుల లక్ష్యాన్ని కూడా బెంగళూరు టీమ్ కాపాడుకోలేనంత పేలవంగా బెంగళూరు బౌలింగ్, ఫీల్డింగ్ ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చేయాలని కెప్టెన్ కోహ్లీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది
                                                                                                            డెస్క్: సుప్రియ