జమ్మూకశ్మీర్ లో ఇధ్దరు ముష్కరులను చంపిన బలగాలు………..

0
1
జమ్మూకశ్మీర్ లో ఇధ్దరు ముష్కరులను చంపిన బలగాలు………..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • బందిపొర జిల్లాలో ఈ ఉదయం ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల గాలింపు
  • ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్ లో ఈ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. బందిపొర జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో… ఈ ఉదయం భద్రతాబలగాలు, పోలీసులు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల మృత దేహాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.