రాహుల్‌ను కశ్మీర్‌కు రావొద్దన్న జమ్మూకశ్మీర్ ప్రభుత్వం……….

0
6
రాహుల్‌ను కశ్మీర్‌కు రావొద్దన్న జమ్మూకశ్మీర్ ప్రభుత్వం……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి
  • శాంతిభద్రతలు, ప్రజల ప్రాణాల రక్షణకే తమ  మొదటి ప్రాధాన్యం
  • ఇక్కడికొచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌లు నేడు శ్రీనగర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ శ్రీనగర్ రావొద్దంటూ ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ ద్వారా కోరింది. వారు శ్రీనగర్ రావడం వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. శాంతిభద్రతలకు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి ఆ వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఇక్కడికొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించింది.