కొంపలు కూల్చారు.

0
16
కొంపలు కూల్చారు.

  ప్రకాశంజిల్లా:ఒంగోలు :న్యూస్‌టుడే:

*లబోదిబోమంటున్నా కనికరించని ముఖ్యమంత్రి….

*డిపాజిట్‌దారులకు చెల్లించేదానికన్నా ఎక్కువ……

అంగట్లో అన్నీ ఉన్నా..అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది. అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల విలువగల ఆస్తులున్నా వాటిని అమ్మిబాధితులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడ్డుగోడలా మారారు. దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు కన్ను పడింది. అయనతోపాటు ఆయన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గద్దల్లా వాలిపోయారు. ఇంకేముంది దొరికిన కాడికి ఆస్తులు లాగేసుకున్నారు. అయినా ఇంకా డిపాజిట్‌దారులకు చెల్లించేదానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులపై కనికరం లేకుండాపోయింది. నాలుగున్నరేళ్లుగా బాధితులను అవిగో ఇస్తున్నా. ఇవిగో ఇస్తున్నా అంటూ ఊరిస్తూ… ఉసూరుమనిపిస్తున్నారంటే చంద్రబాబుది ఎంత కాఠిన్యమైన మనస్సో అర్ధమవుతుంది. చివరకు ఆయన ఐదేళ్లు పరిపాలనా ఫలాలు అనుభవించాడు. కానీ బాధితులకు మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. వేల కుటుంబాలను నిలువునా ముంచాడనటంలో సందేహం లేదు.                                                                                                                డెస్క్:దుర్గ