చోరీ కేసు విచారిస్తే 20 ఏళ్లనాటి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది}

0
4
చోరీ కేసు విచారిస్తే 20 ఏళ్లనాటి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది}

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నాలుగేళ్ల వయసులో మాయమైన చిన్నారి
  • ఇరవై నాలుగేళ్ల ఏళ్ల అనంతరం ఆచూకీ లభ్యం
  • ఓ కి‘లేడీ’ నేర చిట్టావిని నోరెళ్లబెడుతున్న పోలీసులు

                                 వివరాల్లోకి వెళితే… ‘వెతక బోయే తీగ కాలికి తగడం’ అంటే ఇదేనేమో. చోరీ కేసులో చిక్కిన ఓ కి‘లేడీ’ని విచారిస్తున్నపోలీసులకు ఇరవై ఏళ్ల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించడంతో అవాక్కయ్యారు. దాదాపు మూడేళ్లపాటు పిల్లాడి కోసం అవిశ్రాంతంగా గాలించిన కానిస్టేబుల్‌ విచారణలోనే ఈ విషయం బయటపడడం మరో విశేషం. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మి రెండున్నర దశాబ్దాలుగా దొంగతనాలే వృత్తిగా జీవిస్తోంది. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో కలిసి ఊంటోంది. అప్పుడప్పుడు దొంగతనాలు, చోరీలకు పాల్పడుతోంది. ఇటీవల విజయనగరం జిల్లా జియ్యమ్మవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చిన సందర్భంలో భాగ్యలక్ష్మికి అతనితో పరిచయం అయ్యింది. దీంతో అతని ఇంటికి వెళ్లింది. ఈ నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యాపారికి చెందిన బంగారు ఆభరణాలు అపహరించి వుడాయించింది. దీంతో కంగుతిన్న వ్యాపారి విషయం గ్రామస్థులకు తెలిపాడు. దీంతో అలర్టయిన  గ్రామస్థులు ఆమె బస్సులో ఉందని తెలుసుకుని పట్టుకుని జియ్యమ్మవలస పోలీసులకు అప్పగించారు.