మోదీని చంపేందుకు ప్లాన్ వేశారంటూ పోలీసులను పరుగులు పెట్టించిన ఆకతాయి

0
8
మోదీని చంపేందుకు ప్లాన్ వేశారంటూ పోలీసులను పరుగులు పెట్టించిన ఆకతాయి

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • సోమవారం చెన్నైలో మోదీ హత్యకు కుట్ర జరిగిందంటూ ఫోన్ కాల్
  • ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేస్తుండగా విన్నానని ఫోన్
  • సరదాకి ఫోన్ చేశానని చెప్పడంతో పోలీసుల షాక్

                                             వివరాల్లోకి వెళితే…ప్రధాని నరేంద్రమోదీ హత్యకు చేస్తున్న కుట్ర గురించి తాను విన్నానంటూ పోలీసు కంట్రోలు రూముకు ఫోన్ చేసిన ఓ ఆకతాయి పోలీసులను పరుగులు పెట్టించాడు. సోమవారం చెన్నైలో పర్యటిస్తున్న ప్రధాని మోదీని.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసినట్టుగా చంపేందుకు కొందరు ప్లాన్ చేస్తుండగా తాను విన్నానంటూ ఆదివారం ఓ ఆకతాయి చెన్నై పోలీస్ కంట్రోలు రూముకు ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా తాను విన్నానని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.
ఆ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు పరుగులు పెట్టారు. తిరువాన్మియూరు నుంచి కాల్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు ఫోన్ చేసిన యువకుడు తిరునావుక్కరసును అదుపులోకి తీసుకుని వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. మోదీ హత్యకు కుట్ర అంతా అబద్ధమని, సరదాగా చేశానని చెప్పడంతో షాకయ్యారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.