‘వి’ సినిమా విడుదల తేదీ ఖరారు………..

0
1
‘వి’ సినిమా విడుదల తేదీ ఖరారు………..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • విభిన్నమైన కథాంశంతో ‘వి’
  • సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది 
  • ఉగాదికి భారీస్థాయి విడుదల

నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘వి’ సినిమాను రూపొందిస్తున్నాడు. నాని – సుధీర్ బాబు ఇద్దరూ కూడా ఇంతవరకూ చేయని విభిన్నమైన పాత్రలనే పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నివేద థామస్ – అదితీరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.ఈ సినిమాను ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తన కెరియర్లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని నాని భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.