ప్రజల మధ్య పాలన లోకేష్.

0
48
ప్రజల మధ్య పాలన లోకేష్.
 గుంటూరు జిల్లా  మంగళగిరి  న్యూస్‌టుడే :
మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికుల కష్టాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈరోజు ఆయన మంగళగిరి పట్టణంలోని పదో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.స్థానిక నేత కార్మికుడు వెంకటేశ్వరరావు తన ఇంటిలో అచ్చు పనిలో ఉండగా అతన్ని, అతని భార్యను లోకేశ్ పలకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు దంపతులు నేతపనిలో అచ్చు కీలకపాత్ర పోషిస్తుందని మంత్రికి వివరించారు.యాభై ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నామని, అరకొర ఆదాయం వల్ల తమ బతుకుల్లో మార్పు రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే ఈ సమస్యలపై దృష్టి సారిస్తానని లోకేశ్‌ తెలిపారు.
                                                                                                                      డెస్క్:కోటి