‘దొరసాని’లో ఆ సీన్ తీస్తుండగా జీవితగారు కాల్ చేశారు….

0
3
‘దొరసాని’లో ఆ సీన్ తీస్తుండగా జీవితగారు కాల్ చేశారు….

 (టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….  

  • జీవితా రాజశేఖర్ గార్లకి ముందుగానే స్క్రిప్ట్ వినిపించాను …
  • వాళ్లిద్దరూ చాలా ఫొఫెషనల్ గా ఆలోచిస్తారు…
  • ఆ సీన్ విషయంలో జీవితగారికి భరోసా ఇచ్చానన్న మహేంద్ర ….

                          వివారల్లోకి వెళితే….. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దొరసాని’ సినిమాకి ప్రశంసలు దక్కాయి. నిర్మాతలకి ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ .. “ఈ సినిమాలో శివాత్మిక .. ఆనంద్ దేవరకొండ మధ్య ‘కిస్’ సీన్ ఒకటి వుంది. ఆ సీన్ ఉంటుందని నేను స్క్రిప్ట్ చదివి వినిపించేటప్పుడే చెప్పాను.జీవితగారు – రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తారు.  అందువలన వాళ్లేమీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ సీన్ కి నేను ఏ యాంగిల్ పెడతాను .. ఎలా డీలా చేస్తానా అనే ఒక సందేహం జీవితగారికి ఉండేది. అందువల్లనే ఆ సీన్ ను ఆ రాత్రికి తీస్తామనగా, ఆ సాయంత్రం ఆమె నాకు కాల్ చేశారు.