2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించిన సుప్రీంకోర్టు

0
1
2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించిన సుప్రీంకోర్టు

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం పూర్తిచేయాలి
  • విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలి

                                 వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు వెల్లడైన విషయం తెలిసిందే. 2.77 ఎకరాల స్థలాన్ని సుప్రీంకోర్టు.. రామమందిర నిర్మాణానికి అప్పగించింది. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని చెప్పింది. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. వివాదాస్పద స్థలంపై హక్కులు, మత సామరస్యం, శాంతి భద్రతలకు లోబడి ఉంటాయని పేర్కొంది.