పవన్ తీరుతో వాళ్లు రగిలిపోతున్నారట…….

0
7
పవన్ తీరుతో వాళ్లు రగిలిపోతున్నారట…….

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….   

  •  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో సీక్రెట్ పవన్ గా చర్చలు…
  •  ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలని బీజేపీ ప్లాన్… 

                          వివరాల్లోకి వెళితే…..ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో సీక్రెట్ గా చర్చలు జరిపాడన్న ప్రచారం జరిగింది. టీడీపీని నిర్వీర్యం చేసి జనసేనతో కలిసి ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు వార్తలొచ్చాయి.2024 వరకు పవన్ తో కలిసి ఉద్యమాలు చేసి అప్పుడు అధికారంలోకి రావాలని కలలగంటున్న కమ్యూనిస్టులకు జనసేనాని పవన్ వైఖరి షాక్ కు గురిచేస్తోంది. పవన్.. బీజేపీకి దగ్గరవ్వడం కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారట.. పవన్ కనుక బీజేపీతో సాగితే ఇక దోస్తీ ఉండదని.. పవన్ నమ్మకద్రోహాన్ని సహించమని ఆ పార్టీలో చర్చ సాగుతోందట.. పవన్ మరి బీజేపీ తో కలుస్తారా? వామపక్షాలను దూరంగా పెడుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది