అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వరు…మా మాటలు వినరు ………..

0
5
అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వరు…మా మాటలు వినరు  ………..

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • పోలవరం విషయంలో వాకౌట్‌ చేద్దామనుకున్నాం
  • ఆ మాట చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు
  • అవకాశాలన్నీ అధికార పక్షానికే

                     వివరాల్లోకి వెళితే… అధికార, విపక్ష సభ్యులందరికీ మాట్లాడేందుకు సమాన అవకాశం కల్పిస్తామని చెప్పడమే తప్ప అసెంబ్లీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, పోలవరం అంశంపై తాము సభ నుంచి వాకౌట్‌ చేద్దామనుకున్న మాట చెప్పడానికి కూడా మాకు అవకాశం రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేంతా స్పీకర్‌ తమ్మినేనిని ఈరోజు కలిసారు. వైసీపీ తరపున సిగ్నటరీలు కాకున్నా అవకాశం ఇస్తున్నారని, అదే విపక్షం సభ్యులు సిగ్నటరీలు అయినా మాట్లాడేందుకు సమయం కేటాయించడం లేదని స్పీకర్‌కు తెలిపారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని అచ్చెంనాయుడుతోపాటు పయ్యావుల కేశవ్‌ కోరారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ సోమ, మంగళవారాల్లో పోలవరంపై చర్చకు అవకాశం కల్పిస్తామని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.