అర్ధరాత్రి దొరకిన దొంగలు…

0
5
అర్ధరాత్రి దొరకిన దొంగలు…

మార్టూరు, న్యూస్‌టుడే:

జాతీయ రహదారిలో సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్న ఎస్సైపై దాడి చేసిన కేసులో మహారాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులకు ఏడేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ అద్దంకి న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు మార్టూరు ఎస్సై చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. తేదీ.24.09.17న అర్ధరాత్రి దాటాక అప్పటి ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు విధుల్లో భాగంగా బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహరాష్ట్ర ముఠాకు చెందిన రాజీవ్‌ భోంస్లే, విక్రమ్‌ పవార్‌.ఆయనపై దాడి చేసి గాయపరిచారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన అద్దంకి సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.సుజాత… నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై వివరించారు. ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌… ఎస్సై తరఫున వాదనలు వినిపించారు.

                                                                                                               Desk:koti7123