కరీంనగర్ జిల్లాలో విచిత్రం… అదుపుతప్పి గొడెక్కి కూర్చున్న కారు!

0
2
కరీంనగర్ జిల్లాలో విచిత్రం… అదుపుతప్పి గొడెక్కి కూర్చున్న కారు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…

  • గుండ్లపల్లిలో ఘటన
  • నలుగురికి తీవ్రగాయాలు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

రహదారిపై అదుపుతప్పి బీభత్సం సృష్టించిన ఓ కారు, ఎంచక్కా గోడెక్కి కూర్చున్న ఘటన కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జరిగింది. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఈ కారు గుండ్లపల్లి మూలమలుపు ఓ బాలుడిని తప్పించబోయి అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న జెండా దిమ్మెను ఢీకొట్టి, పక్కనే ఉన్నకిరాణాషాపువైపు దూసుకెళ్లి, గోడెక్కింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారిలో ముగ్గురికి తీవ్రగాయాలుకాగా, రోడ్డుపై ఉన్న బాలుడికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ ను తెప్పించి, గోడపై ఉన్న కారును కిందకు దించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.