మన తొలి పండుగ ఉగాది విశిష్టత ఇదే

0
9
మన తొలి పండుగ ఉగాది విశిష్టత ఇదే

తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ రోజున తెలుగు లోగిళ్లలో వసంతలక్ష్మీని ఆహ్వానిస్తూ సంబరాలు జరుపుకుంటారు. ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే తొలి పండుగ ఇది.తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పండిత శ్రేష్టులను ఆహ్వానించి దేవాలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా కొత్త సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణం చేస్తారు.

అందుచేత ఉగాది శుభదినాన అందరూ ప్రాతఃకాలంలో లేచి అభ్యంగనస్నానం ఆచరించి, కొత్త వస్త్రాలు ధరిస్తారు. మంగళ ప్రదమైన మావిడాకులు తోరణాలు కట్టి రంగవల్లికలు వాకిట అలంకరించి వసంతలక్ష్మీకి స్వాగతం పలుకుతారు. షడ్రచుల సమ్మిళతమైన ఉగాది పచ్చడిని పంచాగానికి, కాల దేవతకు నివేదనచేసి, తమ భావిజీవితాలు మృదుమధురంగా సాగిపోవాలని కోరుకుంటారు. 

ప్రళయం తర్వాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదట వచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయాన్ని ‘ఉగాది’ అని వ్యవహరిస్తాం. ఈ పర్వదినం ఛైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణిస్తాం. ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే తొలి పండుగను తెలుగువారంతా ఘనంగా జరుపుకుంటారు. అన్ని కర్మలకూ మనసు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రామాణికంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవడం ఆనవాయితీ.