ఇండియా క్రికెట్ ను టెన్షన్ పెడుతోన్న ప్లేస్ ఇదే!

0
5
ఇండియా క్రికెట్ ను టెన్షన్ పెడుతోన్న ప్లేస్ ఇదే!

 (టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • టీమిండియాలో నెంబర్ నాలుగో స్థానంలో ఎవరు… 
  • క్రికెటర్లకు ఇప్పుడు ఆ ప్లేస్ పెద్ద తలనొప్పి…

                      వివరాల్లోకి వెళితే…… టీమిండియాను ఓ ప్లేస్ చాలా టెన్షన్ పెట్టేస్తోంది. అటు సెలెక్టర్లతో పాటు… ఇటు క్రికెటర్లకు కూడా ఇప్పుడు ఆ ప్లేస్ పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ప్లేస్ లో ఎవరిని ఎంపిక ? చేయాలన్నదానిపై ప్రపంచకప్ కు ముందు ఎంత పెద్ద చర్చ నడిచిందో… ఇప్పుడు మళ్ళీ అదే చర్చ స్టార్ట్ అయింది. ప్రపంచ కప్ కు ముందు టీమిండియాలో నెంబర్ నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్ – విజయ శంకర మధ్య పోటీ నడిచింది. రాహుల్ ముందు మ్యాచ్లలో ఈ ప్లేస్ లోనే ఆడాడు.ఆ తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. నెంబర్ 4లో బ్యాటింగ్కు వచ్చిన విజయ్ శంకర్ ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో రిషిబ్ పంత్ ను తీసుకున్నారు.