చంద్రబాబు నాయుడుని నమ్ముకున్న వారిని అన్యాయం చేయరు…

0
19
చంద్రబాబు నాయుడుని నమ్ముకున్న వారిని అన్యాయం చేయరు…
గుంటూరుజిల్లా: అమరావతి:
.* నీతి నిజాయతీగా రాజకీయలు చేశాను…
* బ్లాక్‌మెయిల్ రాజకీయలు  తెలియవు…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై తనకు నమ్మకం ఉందని, ఆయన తనకు అన్యాయం చేయరని అనుకుంటున్నానని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు అన్నారు. తనకు ఎంపి టికెట్ తో పాటు తన కుమారుడిని సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ను రాయపాటి కోరుతున్నారు. కాగా తాము జిల్లాల్లో నీతి నిజాయితీగారాజకీయాలు చేశామని ఆయన చెప్పారు. తనకన్నా నిబద్ధతతో పని చేసే నాయకులు ఉంటే తాను టికెట్ అడగనని ఆయన చెప్పారు. తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు తమ కుటుంబ సభ్యులకు తెలియవని రాయపాటి స్పష్టం చేశారు.
                                                                                                             డెస్క్:దుర్గ