మద్యం మత్తులో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం……..

0
5
మద్యం మత్తులో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం……..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో ఘటన
  • ఒంటరిగా కనిపించిన చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దారుణం
  • నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు

తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఓ వ్యక్తి ఒంటరిగా కనిపించిన మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కలివేముల పాపయ్య (38) గురువారం సాయంత్రం ఒంటరిగా కనిపించిన చిన్నారిని చూసి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికొచ్చిన కుమార్తెను చూసిన తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అనంతరం భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పాపయ్యను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.