వైసీపీ జెండా దిమ్మెకు కరెంట్… షాక్ కొట్టి ముగ్గురు విద్యా ర్థుల మృతి!

0
1
వైసీపీ జెండా దిమ్మెకు కరెంట్… షాక్ కొట్టి ముగ్గురు విద్యార్థుల మృతి!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…….. 

  • ప్రకాశం జిల్లా సంతమాగులూరు సమీపంలో ఘటన
  • ఆడుకుంటూ వెళ్లి దిమ్మెను పట్టుకున్న విద్యార్థులు
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

భారీ వర్షాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ముగ్గురు చిన్నారులను బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, జిల్లా పరిధిలోని సంతమాగులూరు మండలం కొప్పవరంలో కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ జెండాను ఆవిష్కరించింది. ఇటీవలి వర్షాలకు ఆ జెండాపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. విషయం తెలియని ముగ్గురు విద్యార్థులు ఆడుకుంటూ దాని దగ్గరికి వచ్చారు. జెండా స్తంభాన్ని పట్టుకున్న వారికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దింతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.