తల్లీకొడుకులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు ……….

0
5
తల్లీకొడుకులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు ……….

తెలంగాణ :(టిన్యూస్10):న్యూస్‌టుడే…

  • ఈరోజు తెల్లవారు జామున ఘటన 
  • సంగారెడ్డి జిల్లా కారస్‌గుత్తిలో ఘోరం
  • హత్యకు కారణాలు తెలియరాలేదు

                           వివరాల్లోకి వెళితే…  కారణం ఏమిటో? ఎవరు చేశారో? గుర్తు తెలియని వ్యక్తులు తల్లీ కొడుకుపై కిరోసిన్‌పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనమైంది. తెల్ంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నాగల్‌గిడ్డ మండలం కారస్‌గుత్తిలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘాతుకం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత (35), ఆమె కొడుకు (4)పై దుండగు దాడిచేశారు. అనంతరం కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న బాధితులు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న నాగల్‌గిద్ద పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.