తీపి దోశలు…..

1
5
తీపి దోశలు…..

కావల్సినవి:

  • గోధుమపిండి – కప్పు
  • బియ్యప్పిండి – అరకప్పు
  • కొబ్బరితురుము – రెండు టేబుల్‌స్పూన్లు
  • శొంఠిపొడి – చిటికెడు
  • బెల్లం తరుగు – కప్పు
  • యాలకులపొడి – అరచెంచా
  • నెయ్యి – అరకప్పు
  • జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు – కొన్ని
  • ఉప్పు – చిటికెడు

తయారీ విధానం: ఓ గిన్నెలో గోధుమపిం, బియ్యప్పిండి, కొబ్బరితురుమూ, యాలకులపొడి, శొంఠిపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. బెల్లం తరుగును మరో గిన్నెలోకి తీసుకుని రెండుకప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగి లేత పాకం అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ పాకాన్ని ఒకసారి వడకట్టి గోధుమపిండి మిశ్రమంలో వేసుకుంటూ దోశపిండిలా కలపాలి. ఇది మరీ పల్చగా, అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. పెనాన్ని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకుని ఈ పిండిలో కలపాలి. ఇప్పుడు ఈ పిండిని పెనంమీద దోశలా పరిచి, నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు.

1 COMMENT

Comments are closed.