పులుల వ్యాపారులను రిమాండ్‌కు…..

0
8
పులుల వ్యాపారులను రిమాండ్‌కు…..
ఒడిశా న్యూస్‌టుడే:
*వ్యాపారులను అరెస్టు చేసిన పోలీసులు.
*అరెస్ట్ అయిన వారిని విచారించి రిమాండ్‌కు తరలింపు.
ఒడిశాలోని సంబర్‌పూర్ జిల్లా కుచిండ ప్రాంతంలో శుక్రవారం క్రైంబ్రాంచి  పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు పులిచర్మాల వ్యాపారులను త్వరలో రిమాండుకు తీసుకుంటామని క్రైంబ్రాంచ్ ఏడీజీ సంతోష్ ఉపాద్యాయ్ తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టయినవారిని మళ్లి విచారిస్తామని,ఈ ముఠా వెనుక మరికొంత మంది ఉన్నారని తెలిపారు.శుక్రవారం వ్యాపారులను అరెస్టు చేసి వారి నుంచి 4 చిరుత పులుల చర్మాలు స్వాధినం చేసుకున్నామని తెలిపారు.వారిని సంబల్‌పూర్ న్యాయస్థానంలో హాజరుపరవామని, బెయిల్ లభించకపోవడంతో సంబల్పూర్ కారాగారానికి తరలించారని తెలిపారు.
                                                                                                 డెస్క్-సునీత