తిరుమలలో సమంత… సెల్ఫీల కోసం భక్తుల పోటీ!

0
8
తిరుమలలో సమంత… సెల్ఫీల కోసం భక్తుల పోటీ!

తిరుమల:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • శుక్రవారం విడుదల కానున్న ‘ఓ బేబీ’
  • సినిమా హిట్ కావాలని కోరుకున్న సమంత
  • అన్ని వర్గాలనూ అలరిస్తుందన్న హీరోయిన్

                    వివరాల్లోకి వెళితే….మరో మూడు రోజుల్లో తాను నటించిన ‘ఓ బేబీ’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున చిత్ర ద‌ర్శకురాలు నందినీరెడ్డితో కలిసి ఆమె తిరుమలకు రాగా, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం స్వామి వారి సేవలో సమంత, నందినీ రెడ్డి పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం వెలుపలికి రాగా, భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, దగ్గర నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. తన కొత్త చిత్రం ‘ఓ బేబీ’ సూపర్ హిట్ కావాలని స్వామిని మొక్కుకున్నట్టు సమంత వ్యాఖ్యానించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.