ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయాలని………

0
7
ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయాలని………

బిజినేపల్లి, న్యూస్‌టుడే :

1)ప్రాజక్టు  వద్ద  భైఠాయించిన  కారుకొండ  తండావాసులు……
2)వెంకటాద్రి రిజర్వాయర్‌ పనులను కారుకొండ తండా ప్రజలు అడ్డుకున్నారు……
3) అరవై ఏళ్లు దాటిన ఇంటి యజమానులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీ……..

ఉన్నతాధికారులు మొదట చెప్పిన ప్రకారం తమకు పరిహారాన్ని చెల్లించాలంటూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో చేపడుతున్న వెంకటాద్రి రిజర్వాయర్‌ పనులను మండలంలోని కారుకొండ తండా ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ అరవై ఏళ్లు దాటిన ఇంటి యజమానులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేస్తూ పరిహారం అందిస్తామని గత నెలలో నిర్వహించిన గ్రామసభలో జేసీ చెప్పారని వివరించారు. జేసీ చెప్పిన ప్రకారం తమకు ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే పరిహారం అందజేయకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని అక్కడి గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు చెప్పి వెళ్లిపోయారు.

                                                                                                      డెస్క్:గౌస్&  లక్ష్మణ్