టమాట స్వీట్……….

0
10
టమాట స్వీట్……….

 కావాల్సిన పదార్ధాలు:

  • టమాటాలు: పావుకిలో
  • పంచదార: పావుకిలో
  • కార్న్ ప్లోర్: వంద గ్రాములు
  • నెయ్యి: వంద గ్రాములు
  • యాలుకలుపొడి: 1/2 టీ స్పూన్

తయారు చేయు విధానం:
1టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సిలో  వేసి రసం తియ్యాలి.ఈ రసం ఒక గిన్నెలోకి వడకట్టాలి. 
2ఇలా వడపోసిన  రసంలో కార్న్ ప్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.
3ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసి దానిలో కొద్దిగా నీళ్ళుపోసి  తీగ పాకం పట్టాలి.జీడిపప్పులు వేనేతిలో వేయించుకోవాలి.
4పాకం వచ్చాక కార్న్ ప్లోర్ కలిపిన టమాట రసం వేసి కలుపుతూ ఉడికించాలి.కాసేపటికి గట్టిపడుతుంది.
5ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. నెయ్యి బాగా కలిసాక యాలుకలపొడి వేసి కలపాలి .ముద్దగా అయ్యి పాన్ కి అంటుకోకుండా ఉంటుంది. అంటే టమాట స్వీట్ తయారయింది.
6 ఇప్పుడు ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి ఇలా తయారయ్యిన టమాట స్వీట్ వేసి పలుచగా సర్ది నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి అలంకరించాలి