ర్యాగింగ్ చేసినందుకు మనస్తాపంతో ఇద్దరు మృతి….

0
10
ర్యాగింగ్ చేసినందుకు మనస్తాపంతో ఇద్దరు మృతి….
తమిళనాడు న్యూస్‌టుడే: 
*మధురైలోని త్యాగరాజ కళాశాలలో ఘటన.
*పురుగుల మందు తాగి ఆత్మహత్య.
ర్యాగింగ్ వేధొపులతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.వివరాలు… మదురైలో ఉన్న త్యాగరాజ కళాశాలలో బీఏ ఎకనామిక్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ముత్తపాండి, భరత్‌లు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరిని జయశక్తి, అతని స్నేహితులు హేళన చేస్తున్నట్లు తెలిసింది. వీరి ర్యాగింగ్‌తో మనస్తాపానికి గురై 2వ తేదీ ముత్తుపాండి, భరత్‌ పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్పృహకోల్పోయిన వారిని చికిత్స నిమిత్తం రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్‌ నాలుగు రోజుల కిందట మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముత్తుపాండి శనివారం మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌ గురించి ముత్తుపాండి ఉత్తరం రాశాడు.ఈ మేరకు తల్లి  పోలీసులకు ఫిర్యాదు  చేసింది.
                                                                                        డెస్క్-సునీత