కారు నిండా గంజాయే.. గుంటూరులో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్!

0
4
కారు నిండా గంజాయే.. గుంటూరులో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఘటన
  • పక్కా సమాచారంతో పోలీసుల తనిఖీలు
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మాదకద్రవ్యాలకు హబ్ గా మారుతోంది. తాజాగా విశాఖ నుంచి తరలిస్తున్న 200 కేజీల గంజాయిని ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి ఓ కారు గంజాయి లోడుతో వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గుంటూరు కాజా టోల్ గేట్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా ఓ కారును పరిశీలించిన పోలీసులు అందులో అనుమానాస్పదంగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను తనిఖీ చేశారు.దీంతో వాటిలో గంజాయిని తరలిస్తున్నట్లు బయటయపడింది. దీంతో కారులోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయిని విశాఖపట్నం నుంచి తమిళనాడులోని మధురైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నెలల్లో ఈ మార్గంలో మూడు సార్లు గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. గత నెలలోనే ఓ వాహనంలో తరలిస్తున్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.