ఆ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు……….

0
3
ఆ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు……….
కర్నూలు  న్యూస్‌టుడే:
ఒక ఈవీఎంలో వాస్తవానికి 15 మంది అభ్యర్థుల ఫొటోలు, తమకు కేటాయించిన గుర్తులతో బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుంది. 15 మందితోపాటు నోటాతో కలిపి మొత్తం ఈవీఎంలో పదహారింటికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్, నంద్యాల పార్లమెంట్‌ స్థానాలకు ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండేసీ ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్నూలు నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు, బనగానపల్లెలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండేసి ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 
                                                                                                        డెస్క్:వసుధ