ఉద్యోగుల పూర్వచరిత్ర…

0
5
ఉద్యోగుల పూర్వచరిత్ర…

 

హైదరాబాద్‌  న్యూస్ టుడే:  ఎక్కడైతే చిన్నారులు ఉంటారో.. ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఇక పోలీసుల ‘క్లీన్‌చిట్‌’ అవసరం. పాఠశాలలు, వసతిగృహాలు, అనాథాశ్రమాలు, సంరక్షణ గృహాలు, ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లు.. ఇలా పిల్లల సంరక్షణతో ముడిపడి ఉండే సంస్థలు, కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల పూర్వచరిత్రను తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సదరు వ్యక్తులపై ఎలాంటి కేసులూ లేవని పోలీసుల ద్వారా నిర్ధరించుకోవాలని, ఇకపై రెగ్యులర్‌, ఒప్పంద కొలువుల్లో చేర్చుకునేవారికీ ఈ నిర్ధరణ తప్పనిసరి అని సూచించింది. పిల్లల హక్కులు కాపాడతామని, వారికి భద్రత కల్పిస్తామని సదరు ఉద్యోగుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here