బాపట్ల ఫోటోగ్రాఫర్‌కు ఉగాది పురస్కారం

0
11
బాపట్ల ఫోటోగ్రాఫర్‌కు ఉగాది పురస్కారం

బాపట్ల:న్యూస్‌టుడే:

*అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఉత్సవం..

* ప్రకృతిలో జీవ వైవిద్యం తెలియజేస్తూ తీసిన చిత్రాలకు గుర్తింపు…….

హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఉత్సవంలో బాపట్లకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సంగాని ఏడుకొండలును ఉగాది పురస్కారంతో సత్కరించారు.

ప్రకృతిలో జీవ వైవిద్యం తెలియజేస్తూ ఆయన తీసిన చిత్రాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఏడుకొండలును బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి జయరావు, ప్రతినిధులు వెంకట్రావు, నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. డెస్క్:దుర్గ