ఐకమత్యం మన సంప్రదాయం…దాన్ని కాపాడుకోవాలి : ప్రియాంక

0
0
ఐకమత్యం మన సంప్రదాయం…దాన్ని కాపాడుకోవాలి : ప్రియాంక

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • శాంతియుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు
  • తీర్పుపై ఎవరి అభిప్రాయం ఏదైనా దాన్ని గౌరవించాలని సూచన
  • హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదు

                              వివరాల్లోకి వెళితే…భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయమని, ఐకమత్యమే మన బలమని, దానికి భంగంకలిగేలా ఎవరూ వ్యవహరించవద్దని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక వాద్రా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన సందేశాన్ని ఉంచారు. అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె పార్టీ వర్గాలను సంయమనం పాటించాలని కోరారు. ఎవరి అభిప్రాయం ఏదైనా కోర్టు తీర్పును గౌరవించడం మన బాధ్యతని, తీర్పుకంటే శాంతిభద్రతలు ముఖ్యమని సూచించారు. సామాజిక సామరస్యాన్ని, పరస్పర ప్రేమను పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు. మహాత్ముడి జన్మభూమిలో అహింసకు తావులేదని, ఆయన కలలుగన్న శాంతియుత దేశాన్ని సాధించుకుందామని పేర్కొన్నారు.