వారెవా! రెండోసారీ కోల్‌కతాని ఓడించిన ఢిల్లి క్యాపిటల్స్….

0
6
వారెవా! రెండోసారీ కోల్‌కతాని ఓడించిన ఢిల్లి క్యాపిటల్స్….
 ముఖ్యంశాలు: న్యూస్‌టుడే:
* శతక సమాన ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్.
*ఆఖర్లో ఇంగ్రామ్ సిక్స్ కొట్టడంతో ధావన్‌కి చేజారిన శతకం.
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారి గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ (97 నాటౌట్: 63 బంతుల్లో 11×4, 2×6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకముదు శుభమన్ గిల్ (65: 39 బంతుల్లో 7×4, 2×6), ఆండ్రీ రసెల్ (45: 21 బంతుల్లో 3×4, 4×6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఛేదనలో ధావన్‌తో పాటు రిషబ్ పంత్ (46: 31 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు 180/3తో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
                                                                                                              డెస్క్: సుప్రియ