‘వాల్మీకి’ సినిమా కొత్త విడుదల తేదీ……….

0
2
‘వాల్మీకి’ సినిమా కొత్త విడుదల తేదీ……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…….

  • జిగర్తాండ’ రీమేక్ గా ‘వాల్మీకి’….
  • డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్… 
  • వచ్చేనెల 20న సినిమా విడుదల…

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రం నిర్మితమైంది. వరుణ్ తేజ్ – అధర్వమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు.కొత్త విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన ‘జిగర్తాండ’ సినిమాకి ఇది రీమేక్. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.