ఇదంతా ‘ముద్దాయిల గోల’లా లేదు?

0
2
ఇదంతా ‘ముద్దాయిల గోల’లా లేదు?: వైసీపీపై వర్ల రామయ్య విమర్శలు

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నిమ్మగడ్డ కోసం వైసీపీ ఎంపీల లేఖలు రాయడంపై విమర్శలు
  • జగన్ ప్రగల్భాలు పలికారు
  • ఇదీ మన పాలన! అన్న వర్ల 

                      వివరాల్లోకి వెళితే…ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డను సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు సెర్బియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరుతూ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తూ ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు మొదటి లేఖ ప్రజా సమస్యలపై రాస్తాడనుకున్నానని ప్రగల్భాలు పలికిన జగన్, ఈరోజున నిమ్మగడ్డ విడుదల కోసం వైసీపీ ఎంపీలందరూ సెర్బియా ప్రభుత్వానికి మూకుమ్మడిగా లేఖ రాశారని, ఇదంతా ‘ముద్దాయిల గోల’లా లేదు? ఇదీ మన పాలన! విమర్శించారు.