గడప గడపలో వైసీపీ ప్రచారం…

0
30
గడప గడపలో వైసీపీ ప్రచారం…

కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:

మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్, దేవినేనీ చంద్రశేఖర్ పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.
మహిళలు హరతులు పట్టి ఘన స్వాగతం పలకగా యువకులు జెండాలు చేతబట్టి జై వసంత జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు
ఈ సందర్భంగా వారు జగన్మోహనరెడ్డి గారి నవరత్నాలను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఒక్క సారి ఆలోచించి మైలవరం ఎమ్మెల్యే గా కృష్ణ ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాల‌ని చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైల‌వ‌రం అభ్య‌ర్ధి కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మంత్రి దేవినేనీ ఉమా దోపిడీ కి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు.. అభివృద్ధి ముసుగులో యధేచ్ఛగా దోచుకోవడానికి అలవాటు పడిన మంత్రి దేవినేని ఉమా కు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

                                                                                                                   డెస్క్:విధుల& ఖాన్