పశువుల విషయంలో జర భద్రం…

0
6
పశువుల విషయంలో జర భద్రం…
కడప న్యూస్‌టుడే:
*పశువులపై విష ప్రభావాన్ని చూపే తూటుకాడ మొక్క.
*రైతులు జాగ్రత్త పడకపోతే ప్రమాదం.
  కడప జిల్లాలో వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమ,పశుపోషణపై ఆధారపడి మెజార్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి.పాడి పరిశ్రమతో ఆదాయం పొందుతున్నారు.పాడి పశువులను,సాధారణ పశువులను మేత కోసం పొలాల వద్దకు,చెరువు గట్ల వద్దకు,నీటి కుంటల వద్దకు తోలుకుపోతారు.అయితే అక్కడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.గడ్డితో పాటు గడ్డి మొక్కగా తూటుకాడ మొక్కలు అధికంగా ఉంటున్నాయి.ఈ మొక్కలను పశువులు గడ్డి తో పాటు తినడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని కడప నగర పరిధిలోని అలంఖాన్‌పల్లె పశువైద్యశాల వైద్యుడు గానుగపెంట రచ్చ రాంబాబు రైతులకు సూచించారు.
                                                                                                    డెస్క్:విజయలక్ష్మి