‘వైయస్సార్ రైతు భరోసా’ పథకం పేరు మార్చడాన్ని అభినందిస్తున్నా: విష్ణువర్ధన్ రెడ్డి

0
3
‘వైయస్సార్ రైతు భరోసా’ పథకం పేరు మార్చడాన్ని అభినందిస్తున్నా: విష్ణువర్ధన్ రెడ్డి

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ‘వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్’గా పేరు మార్చడాన్ని అభినందిస్తున్నా
  • కేంద్రంతో గత ప్రభుత్వం గొడవ పడటం వల్లే రాష్ట్రం నష్టపోయింది
  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి

                                                              వివరాల్లోకి వెళితే… రైతు భరోసా పథకాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభంకానుంది. తొలుత ఈ పథకానికి ‘వైయస్సార్ రైతు భరోసా’ అనే పేరు పెట్టినప్పటికీ… తాజాగా ‘వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్’గా పేరును మార్చారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ పథకానికి కేంద్ర నిధులను కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో… పథకం పేరును మార్చడం పట్ట రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం గొడవ పడటం వల్లే రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సమైఖ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెప్పారు.