మాట తప్పి.. ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటున్నారు: శివసేన ఫైర్

0
2
మాట తప్పి.. ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటున్నారు: శివసేన ఫైర్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……

  • పొత్తు ధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తోంది
  • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మాకు తక్కువ సమయాన్ని ఇచ్చారు
  • రాష్ట్రపతి పాలనను విధించాలనే కుట్రలో ఇదొక భాగం

                            వివరాల్లోకి వెళితే…బీజేపీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. అహంకారపూరితంగా బీజేపీ వ్యవహరిస్తోందని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని చెబుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కుదిరిన 50:50 ఫార్ములాకు కట్టుబడకుండా, పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు మరింత సమయాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇస్తే బాగుంటుందని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం 72 గంటల సమయం ఇచ్చిన గవర్నర్… తమకు మాత్రం తక్కువ సమయాన్నే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలనే బీజేపీ యోచనలో ఇదొక భాగమని చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాసక్తతను వ్యక్తం చేసిన నేపథ్యంలో, శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.