వాటర్ మెలన్ ఫెటా సలాడ్.. చిటికెలో తయారు చేయొచ్చు..!

0
7
వాటర్ మెలన్ ఫెటా సలాడ్.. చిటికెలో తయారు చేయొచ్చు..!

తయారీకి కావాల్సినవి: వాటర్ మెలన్, 200 గ్రాముల ఫెటా(చీజ్), ఉల్లిఆకు, అరుగుల(ఆకుకూర) 100 గ్రాములు, 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, టేస్ట్ కోసం బాల్సామిక్ వెనిగర్, పెప్పర్ ఉంటే చాలు.. ఆన్ ది స్పాట్ వాటర్ మెలన్ ఫెటా సలాడ్ చేసేయొచ్చు. 
తయారీ విధానం : పుచ్చకాయను ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. గింజలు తీసేయండి. పుచ్చకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి పెట్టండి. తర్వాత ఉల్లి ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పుచ్చకాయ ముక్కల్లో కలపండి. ఫెటా చీజ్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పుచ్చకాయ మిశ్రమంలో కలపండి. ఆ మిశ్రమాన్ని బాగా కలపండి.అరుగుల ఆకు కూరలను ఓ ప్లేట్ లో వేసి.. పుచ్చకాయ మిశ్రమాన్ని ఆ ఆకు కూరపై వేయండి. ఆ తర్వాత ఆ మిశ్రమం మీద ఆలివ్ ఆయిల్ కొంచెం, బాల్సామిక్ వెనిగర్ కొంచెం, పెప్పర్ వేయండి.. అంతే వాటర్ మెలన్ ఫెటా సలాడ్ రెడీ అయిపోయినట్టే. బయట ఎండ.. మీరు ఇంట్లో ఈ సలాడ్ ను ఎంజాయ్ చేస్తూ తినేయండి.