పెళ్ళిరోజు వేడుకలు …

0
4
పెళ్ళిరోజు వేడుకలు  …

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, నమ్రత దంపతులు ఆదివారం తమ పద్నాలుగవ పెళ్లిరోజు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల కోసం తమ వంతుగా విరాళాలు ఇవ్వడంలో ఆసక్తిని కనబరిచే ఆ దంపతులు ఈ సందర్భంగా హైదరాబాద్‌, బేగంపేటలోని దేవనార్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్లైండ్ చెందిన 650 మందివిద్యార్థులకు విందు ఇచ్చారు. . తమ పెళ్లిరోజును పురస్కరించుకుని మహేష్‌బాబు ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో అందమైన జంటకు ప్రతీకగా మహేష్‌, నమ్రతలు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఏ మాత్రం విరామం దొరికినా కుటుంబంతో గడిపేందుకు అధిక ప్రాధాన్యమిచ్చే హీరోలలో మహేష్‌ ఒకరు. తన పెళ్లిరోజును ఆ దంపతులు ఇద్దరూ ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు. ఇదిలావుండగా… అందమైన జంట అంటూ కథానాయిక శ్రుతిహాసన్‌ ఇదే ఫొటోను షేర్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here