శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి?….

0
9
శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి?….

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక  వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్ర్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్పించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీ దేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు.

                                                                                              డెస్క్: నాగలక్ష్మి